KCR Health Updates: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడిన ఘటనలో తుంటి ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స చికిత్స చేశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. రేపు (డిసెంబర్ 15) ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.
తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకను రిప్లేస్ చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని కోరారు.
కేసీఆర్ అభ్యర్థన మేరకు కొద్ది రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తగ్గిన అభిమానుల తాకిడి ఇప్పుడు నందీనగర్‌లోని ఆయన నివాస వద్ద పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు కోలుకొని తమ మధ్యకు వస్తారా అని కార్యకర్తలు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..