KCR: కేసీఆర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్.. విచారణ ఎప్పుడంటే..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమిషన్ బ్యారేజ్‌ డిజైన్, నిర్మాణం, క్వాలిటీపై దర్యాప్తు చేసింది. పే అండ్‌ ఎకౌంట్స్‌, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులను విచారించింది.

KCR: కేసీఆర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్.. విచారణ ఎప్పుడంటే..
KCR Kaleshwaram

Updated on: Jun 02, 2025 | 3:16 PM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమిషన్ బ్యారేజ్‌ డిజైన్, నిర్మాణం, క్వాలిటీపై దర్యాప్తు చేసింది. పే అండ్‌ ఎకౌంట్స్‌, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులను విచారించింది. వీరంతా సీఎం సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని తెలపడంతో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు అధికారులు.. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్‌రావుకు కూడా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు గతంలో కేసీఆర్ కేబినెట్‌లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు కూడా సమన్లు ఇచ్చింది. జూన్‌ 5న కేసీఆర్‌, జూన్‌ 6న హరీశ్‌రావు, జూన్‌ 9న ఈటల రాజేందర్‌ విచారణకు హాజరుకావాలని నోటీసులలో వెల్లడించింది.

అయితే, జూన్ ఐదో తేదీకి బదులు 11న విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. దీంతో కేసీఆర్ ఈనెల 11న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు హాజరుకానున్నారు.

కాగా.. కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కక్షపూరిత చర్యల్లో భాగంగానే కేసీఆర్‌ను విచారణకు పిలిచారంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..