ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోతుంది..డబ్బులకు ఇచ్చిన ప్రాధాన్యత కుటుంబ సభ్యులకు,బంధువులకు ఇవ్వడం లేదు…ఆస్తుల కోసం అన్నదమ్ములు..తండ్రీ, కొడుకులు గొడవ పడుతున్న సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి.. ప్రస్తుత కాలంలో..డబ్బుకి ఉన్న విలువ రక్తసంబంధానికి లేకుండా పోయింది..డబ్బు కోసం తోడబుట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది సొంత మనుషులు…తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేటలో చోటుచేసుకుంది..
పట్టణంలోని నాసర్ పూర్ కి చెందిన పరిశురాములు అనే వ్యక్తి తన సొంత తమ్ముడు అయిన కనకయ్య వద్ద తన అవసరాల నిమిత్తం 8 నెలల క్రితం 1,20,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.. కాగా కొద్దిరోజుల తరువాత తాను తీసుకున్న లక్ష 20,000 రూపాయల్లో లక్ష రూపాయ లను చెల్లించాడు…ఇంకా మిగతా 20,000లతో పాటు మిత్తి కూడా ఇవ్వాలని పరుశురాములును అడిగాడు కనకయ్య..కాగా ఇప్పుడు తన వద్ద లేవు అని,తర్వాత ఇస్తానని చెప్పాడు పరుశురాములు..అలా కుదరదు అని,తనకు ఇప్పుడే డబ్బులు కావాలని అన్నతో గొడవకు దిగాడు తమ్ముడు కనకయ్య..అన్నదమ్ముల మధ్య మాట మాట పెరిగి గొడవ అయ్యింది..
ఈ క్రమంలోనే అన్న పరుశురాములు పై చేయి చేసుకున్నాడు తమ్ముడు కనకయ్య…అనంతరం అక్కడే ఉన్న హనుమాన్ గుడి ప్రాంగణానికి అన్న,వదినను కట్టేసాడు..స్థానికులు సముదాయించే ప్రయత్నం చేసిన వినలేదు కనకయ్య.. దీనితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పరుశురాములు అతని భార్యాను విడిపించారు… బాధితుల ఫిర్యాదుతో సిద్దిపేట వన్ టౌన్ లో కేసు నమోదు చేసారు పోలీసులు…కేవలం 20,000 రూపాయల కోసం ఇలా సొంత అన్నను, వదినను ఇలా కట్టేయడం చూసిన ప్రజలు ఆశ్చర్యంతో ముక్కునవేలేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..