కాల్ మనీ.. కాల నాగులు.. ఓ టైపు.. నిర్మల్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల లీలు మరో టైపు. వీరు వారిని మించిపోతున్నారు. అడవిలో వేటాడినట్లుగా.. సామాన్యుల రక్తాన్ని జుర్రేస్తున్నారు. అప్పు వసూలు కోసం అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ కేటుగాళ్ల ఆగడాలకు నిదర్శణాలుగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వడ్డీ వ్యాపారి లీలలు హద్దు మీరాయి. అప్పు ఇచ్చి ఏకంగా భూమినే లాక్కుంటున్నాడో కీచక వ్యాపారి. భైంసా పట్టణానికి చెందిన నగల వ్యాపారి దగ్గర రాజు అనే వ్యక్తి 5 ఏళ్ల క్రితం 3 లక్షల 50వేలు అప్పు తీసుకున్నాడు. ఆసమయంలో రెండెకరాల భూమిని తనఖా పెట్టుకున్నాడు. అయితే గడువు దాటిందంటూ తనాఖా పెట్టినభూమిని.. ఆ నగల వ్యాపారి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
అసలు విషయం తెలిసి నగల వ్యాపారిని నిలదీశారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పినా భూమి తిరిగి ఇచ్చేది లేదని చెప్పాడు. భూమి కావాలంటే.. 18 లక్షలు కట్టమంటూ నగల వ్యాపారి హుకుం చేరీ చేశాడు. దీంతో తన భార్య పిల్లలతో సహా వ్యాపారి దుకాణం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్డాడు బాధితుడు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..
Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..