Booster Dose – Covid 19: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ను మరోసారి ప్రారంభించింది. లక్షణాలు ఉన్న వారికి వెంటనే ఐసోలాషన్ కిట్ ను ఆశ వర్కర్లచే పంపిణీ చేస్తుంది సర్కార్. దీనికి సంబంధించిన మెడిసిన్ హైదరాబాద్ నుండి జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం పోస్ట్ ఆఫిస్, ఆర్టీసీ కార్గో సర్వీసు లను ఉపయోగించుకుంటుంది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. చాదర్‌ఘాట్ లో ఐసోలేషన్ కిట్ లు రెడీ అవుతున్నాయి. ఈ పనులు పర్యవేక్షించారు టీఎస్‌ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. ఎవరూ భయపడుకుండా ప్రభుత్వం ఇస్తున్న ఐసోలేషన్ కిట్ లను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ఇదిలాఉంటే.. బూస్టర్ డోస్ వేసుకుంటే కరోనా భారిన పడుతాం అంటూ రూమర్లు రావడంపై వైద్యాధికారులు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవం అని ఫీవర్ ఆసుపత్రి సుపేరెండేంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. బూస్టర్ తీసుకునే సమయానికి లక్షణాలు ఉంటే.. వాక్సిన్ తరవాత బాడీ వీక్ అవుతుందని, ఆ సమయంలో కోవిడ్ ఎటాక్ అయ్యే ఛాన్స్ ఉందే తప్ప బూస్టర్ తో కరోనా వస్తుందనేది తప్పు అని వివరించారు. బూస్టర్ తో పూర్తి స్థాయిలో కరోనా ను నివారించలేమన్న వైద్యులు.. ప్రాణాపాయ పరిస్థితి మాత్రం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఏ వాక్సిన్ అయినా లైఫ్ టైం సేఫ్టీ ఇవ్వలేదన్నారు. కరోనా నుంచి ప్రాణాలతో బయటపడాలంటే తప్పకుండా వ్యాక్సీన్ తీసుకోవాలని డాక్టర్ శంకర్ తెలిపారు.
Also read:
Hyderabad: తీవ్ర విషాదం.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య
Railway Jobs: ఐటీఐ ఉత్తీర్ణతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Telangana: జగిత్యాలలో దారుణం.. మంత్రాల నెపంతో ముగ్గురి హతం.. అసలు కుట్ర వేరే ఉందా?..