
జంతు బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించే వ్యక్తులు సహజంగా కోళ్లు.. మేకలు బలిస్తుంటారు.. మరీ బరితెగించిన వారు మనుషులు బలిచ్చినట్లు అక్కడక్కడా వింటుంటాం… కానీ ఈ బ్యాచ్ అదో టైపు.. పందిని ( వరాహాన్ని) బలిచ్చి అంతా హడలెత్తి పోయేలాచేశారు.. గ్రామ శివారులో పందిని బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామశివారులో క్షుద్ర పూజలు నిర్వహించారు.. రోడ్డు పక్కనే పూజలు నిర్వహించి జనమంతా హడలెత్తి పోయేలా చేశారు.
Also Read: నక్కతోక తొక్కిన రాజు యాదవ్.. ఏకంగా 12 మద్యం షాపులు దక్కాయ్..
ఐతే క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులు వరహాన్నీ బలివ్వడం కలకలం రేపింది.. వరాహం తల భాగం నరికి ఆ రక్తంతో పూజలు నిర్వహించారు..ఆ మార్గంలో వెళ్తున్న గ్రామస్తులు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి క్షుద్ర పూజలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..