Black magic: కరోనా కల్లోలం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. ఇంతటి మహమ్మారి వైరస్ బారి నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ తయారుచేశాం. టెక్నాలజీ(Technology) విషయంలో దూసుకుపోతున్నాం. కానీ కొంతమందిని మూఢనమ్మకాల(Superstition) నుంచి దూరం చేయలేకపోతున్నాం. తాజాగా నల్లగొండ జిల్లా చింతపల్లి మెట్టు మహంకాళి ఆలయం వద్ద జరిగిన నరబలి ఘటన మరవక ముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. యాదాద్రిభువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో క్షుద్ర పూజలు స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేశాయి.. గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు.. నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు తలపించేలా ముగ్గులు వేశారు. గ్రామానికి చెందిన ఉప్పుకృష్ణ పొలానికి వెళ్తుండగా ఈ దృశ్యాలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు ఈ పూజలు చేసి పరారైనట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వ్యవసాయ బావి వద్ద క్షుద్ర పూజలు జరిగాయనే సమాచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గుప్త నిధుల కోసం లేదా, ప్రత్యర్ధుల్ని భయపెట్టడానికో, అంతం చేయడానికి క్షుద్ర పూజలను చేస్తుంటారు. కష్టాల నుంచి గట్టెక్కడానికి… ఊహించని ఐశ్యర్యం దక్కుతుందనో… పదవుల కోసమో క్షుద్ర పూజలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు.. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇలాంటి క్షుద్ర పూజలు, చేతబడులు ఆగడం లేదు. అక్షరాస్యత పెరిగి.. ప్రజల్లో పరిణితి చెందితేనే.. వీటిని అడ్డుకట్ట వేయగలం.
Also Read: Krishna District: ఇంటి ముందు గేట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. కానీ ఊహించని విధంగా
హెల్మెట్ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్.. అతగాడి ఓవరాక్షన్ చూడండి