Bblack Fungus: వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన.. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వదిలేసిన కొడుకు

|

May 27, 2021 | 11:59 AM

Bblack Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌తో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు.

Bblack Fungus: వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన.. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వదిలేసిన కొడుకు
Follow us on

Bblack Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌తో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఒక వైపు కరోనా కట్టడికి చర్యలు చేపడుతుండగా, ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇక తాజాగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణలు ఉండటంతో కొడుకు తండ్రిని వదిలి వెళ్లిపోయాడు. రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య (63) ఈ నెల 3న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తాండూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్యకు.. బుధవారం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడ్డాయి. కన్ను, నుదుటి భాగంలో వాపు, ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఇక నా వల్ల కాదంటూ కొడుకు వదిలేసి పోవడంతో కొడుకుపై పలువురు మండిపడుతున్నారు. కన్నతండ్రినే ఇలా వదిలేసి పోవడం దారుణమంటున్నారు. కొడుకు వదిలిపోవడంతో చంద్రయ్య పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నాడు. ఇక వైద్యులు చంద్రయ్యను మహవీర్‌ ఆస్పత్రికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా మహమ్మారి, మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ ఇలా వైరస్‌లు అన్ని ఒకే సమయంలో దాడులు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇవీ కూడా చదవండి:

shocking ! 18 నెలల చిన్నారిలో బ్లాక్ ఫంగస్…రాజస్తాన్ లో తొలి కేసు.., డాక్టర్లకే పెను సవాల్ ! పరిశోధనలు ముమ్మరం

Covid Drug 2-DG: కోవిడ్‌ బాధితులకు శుభవార్త.. నేడే 2-DG డ్రగ్ సెకండ్ బ్యాచ్ విడుదల.. డ్రగ్ పనితీరుపై భారీ అంచనాలు