BJP Vs TRS: ప్రధాని మోదీ(PM Modi) హైదరాబాద్(Hyderabad) పర్యటన కు సీఎం కేసిఆర్(CM KCR) దూరంగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గల్లో జోరుగా చర్చ నడుస్తోంది. నిన్న విమానశ్రయం వద్దే కేసీఆర్ రాకపోవడం పట్ల విమర్శలు గుప్పించారు బీజేపీ ఛీప్ బండి సంజయ్. తర్వాత మోదీ హైదరాబాద్ విమానశ్రయం వదిలి వెళ్లే సమయానికి మంత్రులు ఎమ్యేల్యేలు ట్వీటర్ వేదికగా మోదీ పాటిస్తున్న ఈక్వాలిటిపై విమర్శలు గుప్పించారు. ఈక్వాలిటి ఎక్కడ అంటు ట్వీటర్ లో ట్రెండింగ్ లో ఉంచారు.. అసలు మోదీ వచ్చింది ప్రైవేటు కార్యక్రమం అయితే కేసీఆర్ ఎందుకు స్వాగతం చెప్పాలి అంటు టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
అయితే ఇప్పుడు బీజేపీ ఈ విషయంపై సీరియస్ అవుతోంది. మోదీ మొదట వెళ్లింది ICRISAT కు అది పుర్తిగా ప్రభుత్వం కార్యక్రమం అప్పుడు రావడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. జ్వరం వచ్చిందని ప్రచారం చేసుకుంటు వితండ వాదం చేయడం ఏమిటని బండి సంజయ్ అంటున్నారు. సమాత ముర్తి విగ్రహాం మోదీ అవిష్కరించడం కేసిఆర్ కు ఇష్టం లేదని.. అందుకే ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ..
ఇంతటితో వివాదం ముగియకుండా కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. వివక్షకు చిహ్నాం లాంటి వ్యక్తి ఈక్వాలిటి విగ్రహాం అవిష్కరించడం చుస్తుంటే వ్యంగం కూడా కొన్ని కోట్లు సార్లు చచ్చిపోతుందని ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం ఇక్కడతో ముగియకుండా రానున్న రోజుల్లో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ గా మరింత వేడి రాజుకునేలా ఉంది.
Also Read: