Telangana Politics: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. సెప్టెంబర్‌ 17న అక్కడ జెండా ఎగరేసేది ఎవరు..?

|

Sep 05, 2023 | 9:10 PM

September 17 Telangana Politics: సెప్టెంబర్‌ 17 టెన్షన్‌ మరోసారి తెలంగాణ రాజకీయాలను చుట్టుముడుతోంది. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలకు కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. అయితే వేదిక విషయంలో మరోసారి పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోనే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని

Telangana Politics: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. సెప్టెంబర్‌ 17న అక్కడ జెండా ఎగరేసేది ఎవరు..?
Telangana Politics - BJP vs Congress
Follow us on

BJP vs Congress: సెప్టెంబర్‌ 17 టెన్షన్‌ మరోసారి తెలంగాణ రాజకీయాలను చుట్టుముడుతోంది. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలకు కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. అయితే, వేదిక విషయంలో మరోసారి పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోనే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. గతేడాది పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 16న, 17 తేదీల్లో వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 17న భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించాలని భావించారు. దీని కోసం మూడు రోజుల క్రితమే రక్షణ శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే తాము ధరఖాస్తు చేసిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌ కలిసి కుట్రపూరితంగా అనుమతి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఈ మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16,17, 18 మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కేడర్ కు పిలుపునిచ్చారు. దీనిపై బుధవారం కేసీ వేణుగోపాల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో 10లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారన్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని రేవంత్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్ 2న డిఫెన్స్ అధికారులకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. కానీ పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయంటూ పైర్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెడతామంటూ కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమంటూ వివరించారు. ప్రభుత్వమే కుట్రదారుగా మారడం దారుణమని.. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంలో అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయినా.. బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదంటూ స్పష్టంచేశారు.

ఔటర్ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. 17న సోనియాగాంధీ ఇచ్చే 5గ్యారంటీలను 18 నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటున్నామని రేవంత్ వివరించారు. ఈ మేరరకు 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు పర్యటించి కాంగ్రెస్ హామీల గురించి చెబుతారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..