Bandi Sanjay: డీజిల్‌ సెస్సు పేరుతో సీఎం కేసీఆర్ దోపిడీ.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఆందోళన..

|

Jun 10, 2022 | 1:44 PM

డీజిల్‌ సెస్సు పేరుతో ఆర్టీసీ బస్సు టికెట్ల పెంపుపై ఆందోళన చేపట్టారు బండి సంజయ్. సికింద్రాబాద్‌లోని JBSకు వెళ్లారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు..

Bandi Sanjay: డీజిల్‌ సెస్సు పేరుతో సీఎం కేసీఆర్ దోపిడీ.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఆందోళన..
Bandi Sanjay
Follow us on

డీజిల్‌ సెస్సు పేరుతో ఆర్టీసీ బస్సు టికెట్ల పెంపుపై ఆందోళన చేపట్టారు బండి సంజయ్. సికింద్రాబాద్‌లోని JBSకు వెళ్లారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు బండి సంజయ్. ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌ స్టేషన్‌ (JBS) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీనిలో భాగంగా సంజయ్‌ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు.

పేదలకు ఆర్టీసీ బస్సులే దిక్కు అని చెప్పారు. మూడేళ్లలో ఐదు సార్లు ఛార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని.. ఆ కుట్రలో భాగమే ఛార్జీల పెంపు అని సంజయ్‌ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు కూడా ఇంకా చెల్లించలేదని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి

తొలుత జేబీఎస్‌ వద్దకు బండి సంజయ్‌ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకుని గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత పోలీస్‌ ఎస్కార్ట్‌తోనే సంజయ్‌ జేబీఎస్‌కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు.