పేపర్‌ లీక్‌ దోషులను జైల్‌కు పంపే వరకు వదిలి పెట్టేది లేదు- బండి సంజయ్‌

|

May 27, 2023 | 9:24 PM

పథకాలు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిదిగా మారిందన్నారు బండి సంజయ్‌. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగ మార్చ్‌తో ఖమ్మం క్యాడర్‌లో జోష్‌ పెరిగింది.

పేపర్‌ లీక్‌ దోషులను జైల్‌కు పంపే వరకు వదిలి పెట్టేది లేదు- బండి సంజయ్‌
Bandi Sanjay
Follow us on

పేపర్‌ లీక్‌ దోషులను జైల్‌కు పంపే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ఖమ్మం వేధికగా మరో సమరశంఖారావాన్ని పూరించింది కమల దళం. పేపర్‌ లీక్‌ యవ్వారంపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేపట్టాలంటూ చేపట్టిన నిరుద్యోగ నిరసన మార్చ్‌కి జనం భారీగా తరలి వచ్చారు. టీపీఎస్‌సీ గ్రూప్‌ వన్‌ పేపర్‌ లీక్‌పై బీజేపీ పోరాటం కొనసాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ నిరసన మార్చ్‌ నిర్వహిస్తోంది. ఆందోళనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కమిటీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌కి బండి సంజయ్‌ హాజరయ్యారు. మార్చ్‌లో భాగంగా.. ముందు జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్చ్‌కి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిరుద్యోగలనుద్దేశించి బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ బీజేపీ వికసిస్తుందన్నారు.

బీఆర్ఎస్ అతుకుల పార్టీ అన్న బండి..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. ఎవరూ భయపడొద్దన్నారు. సీఎం కేసీఆర్‌ చేసేవన్నీ ఓటుబ్యాంక్‌ పాలిటిక్స్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. పేపర్‌ లీక్‌లో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకుంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. లోకల్‌ బాడీల్లో కూడా ఒక్క పని కావడం లేదని మండిపడ్డారు బండి సంజయ్‌. ఖమ్మంలో ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌ రాలేదన్నారు.

పథకాలు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిదిగా మారిందన్నారు బండి సంజయ్‌. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగ మార్చ్‌తో ఖమ్మం క్యాడర్‌లో జోష్‌ పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..