కరీంనగర్, అక్టోబర్ 08: తెలంగాణ బీజేపీలో ఆయన మాస్ లీడర్.. పార్టీకి ఎప్పుడు లేనంత క్రేజ్ తీసుకువచ్చిన నాయకుడు.. అర్బన్ నియోజకవర్గాలు తప్ప గ్రామీణ నియోజకవర్గలో అంత పట్టులేని పార్టీని కూడా ప్రతి గ్రామంలో బలోపేతం చేసిన నేత.. అతడు మైక్ పెట్టాడంటే ప్రత్యర్థుల గుండెలో దడ పుడుతోంది. పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిత్వం అతని సొంతం.
కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన వెంటనే కార్యకర్త ముందు వాలిపోయే నైజం అతని సొంతం. పార్టీలో ఏ నాయకుడికి లేనంత అభిమానాన్ని కార్యకర్తల్లో సంపాదించుకున్నారు బండి సంజయ్. పార్టీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడితే చాలు కార్యకర్తల్లో ఎనలేని జోష్ వస్తుంది. అలాంటి ఆ నాయకుడు మా నియోజకవర్గాలో పోటీ చేయాలంటే మా నియోజకవర్గంలో పోటీ చేయాలని 4 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట.
ఆ నాయకుడే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. ఆ నాయకుడినే ముధోల్, వేములవాడ, కరీంనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని కార్యకర్తలు పట్టు పడుతున్నారంట. ముధోల్ నియోజకవర్గం బైంసా లో మత ఘర్షణలు జరిగినప్పుడు.. చాలా ఇండ్లు దగ్ధమయ్యాయి.. బైంసా ప్రజలకు కొండంత అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లను కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్య చేపించారు. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు సేవా భారతి ట్రస్ట్ ద్వారా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. హిందూ వాహిని కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు.
ముధోల్ నియోజకవర్గం లో హిందూ భావజాలం పెద్ద ఎత్తున ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో హిందూ సామ్రాట్‌గా పేరున్న బండి సంజయ్ పోటీ చేస్తే ఇక్కడ విజయం బీజేపీకి సునాయాసనం అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారట. అంతేకాకుండా మైనార్టీ ఓట్లు 50,000 ఉంటే బండి సంజయ్ సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం ఓట్లు 50 వేల పై చీలుకు ఉన్నాయని సమాచారం. దీంతో ముధోల్ లో బండి సంజయ్ పోటీ చేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అక్కడి కార్యకర్తలు భావిస్తున్నారని సమాచారం.
ఇక వేములవాడ నియోజకవర్గం లో కూడా పోటీచేయాలని బండి సంజయ్ పై కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వేములవాడలో మున్నూరు కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉంటాయి. బిజెపికి పట్టున్న ప్రాంతం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని బి ఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విస్మరించిందని, బండి సంజయ్ ఇక్కడి నుండి పోటీ చేస్తే వేములవాడలో కషాయ జెండా ఎగురడం ఖాయమని బిజెపి కార్యకర్తలు లెక్కలు వేస్తున్నారట. ఇక కరీంనగర్ నుండే పోటీచేసి ఇక్కడ బి ఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించి కరీంనగర్ సత్తా ఎందో చూపించాలని కరీంనగర్ కార్యకర్తలు ఇక్కడినుండే పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట…
ఇక ఎల్బీనగర్ నుండి పోటీ చేస్తే జిహెచ్ఎంసి నియోజకవర్గాల్లో ప్రభావం చూపి పార్టీకి కలిసి వస్తుందని ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తలు లెక్కలు వేస్తున్నారట. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారంతో ghmc ఎన్నికలో 48 కార్పొరేట్ స్థానాలు గెలుచుకున్నాం.. బండి ఎల్బీనగర్ నుండి పోటీ చేస్తే పూర్తి ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నియోజకవర్గాల మీద పడి పార్టీకి లాభం జరుగుతుందని ఎల్బీనగర్ కార్యకర్తలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇలా బండి సంజయ్ ని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు మా నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ,మా నియోజకవర్గంలోనే పోటీచేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది.
అయితే బండి ఇప్పటికే ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలు వేరు వేరు గా వస్తే కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. కానీ పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. మరి బండికి జాతీయ పార్టీ ఎక్కడి నుంచి టికెట్ కన్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం