టెన్త్ పేపరు లీకేజీలో బండి సంజయ్‌ను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. పేపరు లీక్‌పై వరంగల్ సీపీ రెండు రోజుల్లో రెండు రకాలుగా చెప్పారని.. పూర్తిగా కట్టు కథలు అల్లారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకున్న మాటలన్నీ సీపీ ద్వారా చెప్పించిందని.. సంజయ్‌పై కేసు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు రఘనందన్. ఈ కేసులో కీలకంగా ఉన్న శివగణేష్ ఫోన్‌ను ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. శివగణేష్ ఫోన్ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలకు వాట్సాప్ వెళ్లిందో గుర్తించారా అని నిలదీశారు రఘనందన్‌రావు.
బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేశామని కరీంనగర్ పోలీసులు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వడంపైనా ఎమ్మెల్యే రఘునందన్‌రావు రియాక్ట్ అయ్యారు. అరెస్ట్ సమయంలో ఒక ఎంపీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు రావడంతో.. వెంటనే ప్లాన్ మార్చేసి సంజయ్‌ను కేసులో ఇరికించారని ఆరోపించారు రఘనందన్‌రావు. ఒకవేళ లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావిస్తే.. ఒక ఎంపీగా సంజయ్ తన హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు.
కొందరు ఐపీఎస్ అధికారులు తనపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచేలా మాట్లాడట లేదని.. ఈ విషయంలో ఎవరికి క్లారిటీ ఇవ్వాలో వారికి ఇచ్చానన్నారు రఘనందన్‌రావు. కావాలంటే ఈ అంశంపై సరైన వైదికపై స్పష్టత ఇస్తానని చెప్పారు. నిన్న బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా డీజీపీని ఉద్దేశించి ఆయన అభ్యంతరకర కామెంట్స్ చేశారంటూ ఐసీఎస్‌ల సంఘం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..