Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్.. బీజేపీ అభ్యర్థి తరపున జీవిత ఇంటింటి ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బిజెపి అగ్ర నేతలకు తోడు సినీ గ్లామర్ తోడైంది. బిజెపి అభ్యర్థి తరపున ఇప్పటికే సినీ నటుడు బాబు మోహన్ ప్రచారం చేయగా తాజాగా సినీనటి జీవిత కూడా ప్రచారంలోకి దిగింది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్.. బీజేపీ అభ్యర్థి తరపున జీవిత ఇంటింటి ప్రచారం
Jeevita Munugodu Bye Polls

Updated on: Oct 20, 2022 | 1:41 PM

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టిఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ నివ్వబోతుందని సినీనటి బిజెపి నాయకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు. తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను టిఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా..మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు జీవిత.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బిజెపి అగ్ర నేతలకు తోడు సినీ గ్లామర్ తోడైంది. బిజెపి అభ్యర్థి తరపున ఇప్పటికే సినీ నటుడు బాబు మోహన్ ప్రచారం చేయగా తాజాగా సినీనటి జీవిత కూడా ప్రచారంలోకి దిగింది. చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం లో జీవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఉప ఎన్నికల్లో మహిళా శక్తిని చాటుతారని ఆమె అన్నారు. ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోలీస్లతోపాటు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాయి. నియోజకవర్గంలోకి భారీగా డబ్బు మద్యం డంపు కాకుండా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 28 చెక్ పోస్టులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఐదు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. మరో ఐదు కంపెనీలు రానున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సమస్య ఆత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లను కేంద్ర బలగాలు నిర్వహించాయి. నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. విఐపి వాహనాలను కూడా కేంద్ర బలగాలు తనిఖీ చేస్తున్నాయి.

Reporter : Revan Reddy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..