Telangana Elections: తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌గా ఫోకస్‌.. అగ్రనేతల ప్రచారంతో జోష్‌..

BJP: తెలంగాణకు నిధులు నిలిపివేశారన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు నిర్మాల సీతారామన్‌. నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చాం.. కండీషన్స్‌ పాటించికపోతే అదనంగా అప్పులు ఎలా ఇస్తారని ప్రశ్నించారామె. కేసీఆర్‌ను జాతీయ నేతగా ఎవరూ అంగీకరించలేదన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. మోటార్లకు మీటర్లనేది అబద్దమన్నారు నిర్మలా.

Telangana Elections: తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌గా ఫోకస్‌.. అగ్రనేతల ప్రచారంతో జోష్‌..
Nirmala Sitharaman

Edited By:

Updated on: Nov 22, 2023 | 4:29 PM

Telangana Elections: తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌గా ఫోకస్‌ పెట్టింది. అగ్రనేతల ప్రచారంతో క్యాడర్‌ జోష్‌గా దూసుకెళ్తోంది. మరోవైపు మోదీ, అమిత్‌ షా, నడ్డా ఒకరెనక ఒకరు జాతీయ నేతలు ప్రచారపర్వంలోకి వస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మాల సీతారామన్‌ జూబ్లిహిల్స్‌ బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి తరపున ప్రచారం చేశారు. బంగారంలాంటి తెలంగాణను అప్పుల కుప్ప చేశారంటూ కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు సంధించారామె.

తెలంగాణకు నిధులు నిలిపివేశారన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు నిర్మాల సీతారామన్‌. నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చాం.. కండీషన్స్‌ పాటించికపోతే అదనంగా అప్పులు ఎలా ఇస్తారని ప్రశ్నించారామె. కేసీఆర్‌ను జాతీయ నేతగా ఎవరూ అంగీకరించలేదన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. మోటార్లకు మీటర్లనేది అబద్దమన్నారు నిర్మలా.

అటు మహారాష్ర్ట మాజీ సీఎం ఫడ్నవీస్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో కలిసి ముషీరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిలో బీఆర్‌ఎస్‌కు మెడల్‌ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు ఫడ్నవీస్‌. మహారాష్ర్టలో బీఆర్‌ఎస్‌కు స్థానం లేదన్నారు. తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ దుకాణం బందన్నారాయన.

ఇవి కూడా చదవండి

బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌..MIM టార్గెట్‌గా బీజేపీ విమర్శలకు పదను పెడుతోంది. 21 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ డబ్బులిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌ రావు. BJP అధికారంలోకి రాగానే MIM ఆస్తులను జప్తు చేస్తామన్నారాయన.

కరీంనగర్‌లో బండి సంజయ్‌… వేములవాడలో వికాస్‌.. గజ్వేల్‌లో ఈటెల రాజేందర్‌  ప్రచారం నిర్వహించారు. ఓవైపు  అభ్యర్థుల ప్రచార హోరు.. మరోవైపు వరుసగా అగ్రనేతల టూర్లు.. వెరసి కమళదళం క్యాంపెయినింగ్‌ కలర్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..