AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ అక్కడకి చెరువెలా వచ్చింది..!

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
Warangal Smart City Model Bus Stand
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 13, 2025 | 4:19 PM

Share

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ అక్కడకి చెరువెలా వచ్చింది..! నగరం నడిబొడ్డున ఎందుకలా బోట్స్ తో నిరసన తెలిపారు..?

రెండేళ్లు గడిచినా వరంగల్ స్మార్ట్ సిటీ మోడల్ బస్టాండ్ నిర్మాణం మొదలుకాలేదు. పాత బస్టాండ్ ను కూల్చేశారు.. అక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు జరిపి ప్రమాదకరంగా వదిలేశారు.. సెల్లార్ నిర్మాణం కోసం సుమారు 20 ఫీట్ల లోతు మట్టి తవ్వకాలు జరిపి అసంపూర్తిగా వదిలేశారు. 74 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన బస్టాండ్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.. దీంతో పునాదుల కోసం తవ్విన బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం చెరువును తలపిస్తుంది. వర్షపు నీరంతా అక్కడే నిలిచి ప్రమాదకరంగా మారింది.

బస్టాండ్ నిర్మాణ పనులు నిలిచి పోవడంతో తాత్కాలిక బస్టాండ్ ద్వారానే ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణం అనేక విమర్శలు మూట కట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వరంగల్ కు చెందిన బీజేపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణంతో నిరసన ప్రదర్శన చేపట్టారు.

తెప్పలు, బోట్స్ తీసుకువచ్చి బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్ తో తిరుగుతూ పూలుచల్లి నిరసన తెలిపారు. రెండేళ్లు గడిచిన కనీసం ఒక పిల్లర్ నిర్మాణం కూడా చేపట్టలేదని బీజేపీ నేతలు మండి పడ్డారు. కాంట్రాక్టర్ తో కమిషన్ల విషయంలో విభేదాలు బస్టాండ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోవడానికి కారణమని ఆరోపించారు. వెంటనే బస్టాండ్ నిర్మాణపనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, వరంగల్ కో ఆ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు..

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!