
బీఆర్ఎస్ పార్టీ నేత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్‌కు పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీమ్ పోలీసులు వెల్లడించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ అధికారులు దాడి నిర్వహించారు. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్ గోదావరీ జిల్లాకు చెందిన ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ నిర్వహించిన టెస్ట్‌లో ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. పుట్ట మహేష్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక వివరాలను రంగారెడ్డి ఎస్పీ గిరిధర్ మీడియాకు వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. శనివారం (మార్చి 14) నిర్వహించిన టెస్ట్‌లో పుట్టా మహేష్‌కు నెగెటివ్ వచ్చింది. అయితే ఇవాళ నిర్వహించిన టెస్ట్‌లో ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందనిఈగల్ ఎస్పీ తెలిపారు. శరీర మెటబాలిజమ్ బట్టి రిపోర్టులో వ్యత్యాసం ఉందని ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు.
తాండూరు పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిలో 11 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు చేసినట్లు ఈగల్ టీమ్ పోలీసులు తెలిపారు. శరీర మెటబాలిజమ్ బట్టి రిపోర్టులో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు అయ్యింది. కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. గతంలో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..