Big News Big Debate: తెలంగాణ రణరంగం.. ప్రచారంలో స్పీడు.. విమర్శల్లో పదును

బీఆర్‌ఎస్‌ తరపున కేసీఆర్ సుడిగాలి పర్యటనలు... కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ - ప్రియాంకల క్యాంపెయిన్‌... ఇక పొత్తులపై జనసేనతో బీజేపీ నేతల మంత్రాంగం.. వెరసి తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, చేరికలు, అలకలు, అలజడులతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సెగ రాజుకుంది.

Big News Big Debate: తెలంగాణ రణరంగం.. ప్రచారంలో స్పీడు.. విమర్శల్లో పదును
Big News Big Debate

Updated on: Oct 18, 2023 | 6:48 PM

బీఆర్‌ఎస్‌ తరపున కేసీఆర్ సుడిగాలి పర్యటనలు… కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ – ప్రియాంకల క్యాంపెయిన్‌… ఇక పొత్తులపై జనసేనతో బీజేపీ నేతల మంత్రాంగం.. వెరసి తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, చేరికలు, అలకలు, అలజడులతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సెగ రాజుకుంది.

ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ స్పీడు పెంచాయి.. ఇప్పటికే రాహుల్‌ – ప్రియాంకలు శివాలయంతో పూజలతో క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు.. షెడ్యూల్‌కు ముందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు సభల్లో పాల్గొనగా.. తాజాగా అమిత్‌షా సహా అగ్రనేతల పర్యటనలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు బీజేపీ నేతలు. ఇక ఇప్పటిదాకా రోజుకు రెండు సభల్లో ప్రసంగించిన కేసీఆర్‌ 26 నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు…

చేరికలు, సామాజికసమీకరణాలు, బజ్జగింపులు అనే త్రిముఖ వ్యూహంతో దూకుడు పెంచింది బీఆర్ఎస్‌. బలమైన బీసీ వర్గాలకు చెందిన నాయకులతో పాటు… ఇతర పార్టీల్లో టికెట్ల ఆశించి భంగపడ్డ నాయకులను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే పొన్నాల వంటి సీనియర్‌ నాయకుడికి రెడ్‌ కార్పెట్‌ పరచడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది BRS. అదే సమయంలో పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను బుజ్జగించే బాధ్యతలు కేటీఆర్‌, హరీష్‌రావులకు అప్పగించారు. అటు ప్రచారం.. ఇటు వ్యూహాల్లో బీఆర్ఎస్‌ అందరికంటే ముందే ఉంది. వంద సీట్లతో విజయం సాధిస్తామన్న ధీమా అధికారపార్టీలో బలంగా ఉంది. రాష్ట్రానికి 60 ఏళ్లుగా ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే అంటోంది బీఆర్ఎస్‌.

అటు ఆరు గ్యారెంటీలతో విజయం తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌, ప్రియాంకలను ప్రచార క్షేత్రంలోకి దింపింది. కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్లో అన్నాచెల్లెళ్ల ప్రచారంతో అధికారంలోకి వచ్చామని కేడర్‌ అంటోంది. తెలంగాణలోనూ విజయంపై ధీమాగా ఉన్నారు పార్టీ నాయకులు. ఇతర పార్టీలతో పోల్చితే చేరికల్లోనూ స్పీడు పెంచింది కాంగ్రెస్‌ పార్టీ. ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్‌ కేడర్‌ వరకూ చేరికలపై పార్టీ దృష్టి సారించారు. లెఫ్ట్‌ పార్టీలతో పాటు కోదండరామ్‌ తో పొత్తులపైనా చర్చలు జరుపుతోంది హస్తం పార్టీ.

మరోవైపు అభ్యర్ధుల జాబితా, మేనిఫోస్టోపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపోమాపో లిస్ట్‌ విడుదల చేస్తామంటున్న కాషాయం పెద్దలు అగ్రనేతలను ప్రచారంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనూ పొత్తులపై చర్చలు జరుపుతోంది పార్టీ.

వ్యూహాలు, ప్రతివ్యూహాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీలు అధికారమే లక్ష్యంగా కదనరంగంలోకి దిగాయి. మరి ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..