Delivery in Govt Hospital: నిన్నగాక మొన్న ఓ జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించి పేద ప్రజల్లో భరోసా నింపగా.. ఇవాళ ప్రభుత్వ వైద్యురాలు సర్కారీ దావఖానలో ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అందరికీ ఆదర్శనంగా నిలిచారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సువర్ణ.. కాగజ్ నగర్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్నారు. ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు డాక్టరమ్మ. పుట్టిన బాబు మూడున్నర కేజీలు ఉండగా.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. సర్కారీ వైద్యురాలు.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.
డాక్టర్ సువర్ణ స్వస్థలం కాగజ్ నగర్ పట్టణం. ఆమెకు వివాహం అయిన తరువాత భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయుష్ విభాగంలో డాక్టర్‌గా చేరారు సువర్ణ. ఆయుష్ డాక్టర్‌గా ఎంతోమందికి వైద్య సేవలు అందించారు. అయితే, గర్భవతి అయిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. నెలలు నిండటంతో.. డాక్టర్ సువర్ణ కాగజ్ నగర్ పట్టణ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆమెకు నార్మల్ డెలివరీ అవడం అంతా సంతోషించారు. డాక్టర్ సువర్ణకు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారంటూ ప్రశంసించారు.
ఇదిలాఉంటే.. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన మాధవికి వైద్యులు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు కలెక్టర్ దంపతులకు శభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Also read:
Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..
Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..
Kulbhushan Jadhav: కుల్‌భూషణ్ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్ కోర్టు