AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Conclave: ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడ ఎవరూ పోటీ పడటం లేదు.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

Mallu Bhatti Vikramarka in TV9 Conclave: సీఎం కేసీఆర్ జనం జేబులు కొట్టేశారు.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. BRSవి అభూత కల్పనలని.. గెలవబోయేది కాంగ్రెసే అంటూ సీఎల్పీ నేత భట్టి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. TV9 కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన భట్టి విక్రమార్క పలు విషయాలపై మాట్లాడారు.

TV9 Conclave: ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడ ఎవరూ పోటీ పడటం లేదు.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
Tv9 Conclave
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2023 | 1:24 PM

Share

Mallu Bhatti Vikramarka in TV9 Conclave: తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు.. ఆ పార్టీయే అధికారంలోకొస్తే… సీఎం అయ్యేదెవరు…? సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కాంగ్రెస్ అధికారంలొస్కే 6 నెలలకో ముఖ్యమంత్రంటూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరూ ఒక్కో ప్రకటన చేస్తూ వస్తున్నారు. కొడంగల్ ప్రచారంలో సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కొడంగల్ బిడ్డకు ఇప్పుడు ఛాన్స్ రాబోతోందంటూ పరోక్షంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో రేవంతే సీఎం అంటూ కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత మంది రేవంత్ పాటే పాడుతున్నారు కూడా. ఎవరో ఎందుకు సాక్షాత్తు సీఎల్పీ నేత… సీఎం రేసులో ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్న వ్యక్తి మల్లు భట్టి విక్రమార్కకు స్వయాన సోదరుడైన మల్లు రవి కూడా సోదరుణ్ణి కూడా పక్కన పెట్టి రేవంత్ పాటే పాడుతున్నారు. ఈ నేపథ్యంలో అస్సలు భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్నారా..? ఇంకా అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీలో సీఎం విషయమై ఎందుకింత రచ్చ జరుగుతోంది…? ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చే వేదికగా నిలిచింది టీవీ 9 మెగా పొలిటికల్ కాన్ క్లేవ్.

వాట్ తెలంగాణ థింక్స్ నౌ పేరిట తెలుగు మీడియా చరిత్రలోనే తొలిసారిగా టీవీ9 నిర్వహించిన మెగా కాన్ క్లేవ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీఎం రేసు విషయంలో జరుగుతున్న రచ్చపైనే కాదు… కేసీఆర్ పాలనపైనా… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరంపైన సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

సీఎం కేసీఆర్ జనం జేబులు కొట్టేశారు.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు భట్టి. BRSవి అన్నీ అభూత కల్పనలేనని.. తెలంగాణ ఎన్నికల్లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏం ఆలోచిస్తోంది? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు?. తదితర అంశాలపై టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో అడిగిన అనేక ప్రశ్నలకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క క్లియర్‌ కట్‌‌గా ఆన్సర్లు చెప్పారు. తన సుదీర్ఘ పాదయాత్రలో గమనించిన ప్రజాసమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న కారణంతోనే తమపై సీఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నారని, ఇది ఓ రకంగా ఓటమి భయమే తప్ప మరో కారణం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతే రాజ్యమేలుతోందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ విషయంలో వినిపిస్తున్న ట్రెండ్.. ఏదో గాలివాటంగా వచ్చిన హైప్ కాదని, గెలిచి చూపిస్తామన్నారు భట్టి. ముఖ్యమంత్రి విషయంలో అటు పార్టీలోనూ, ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్న రక రకాల కామెంట్స్‌పై కూడా రియాక్ట్ అయ్యారు ఈ సీనియర్ కాంగ్రెస్ నేత. దళిత సీఎం అని తాను ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఎవరూ పోటీ పడటం లేదని, ఈ విషయంలో ప్రత్యర్థులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాని స్పష్టం చేశారు. అదే సమయంలో తన సోదరుడు మల్లు రవి రేవంత్‌ను సపోర్ట్ చేస్తున్నారన్న వ్యాఖ్యలపైనా స్పందించారు భట్టి. భిన్నాభిప్రాయాలుండటం సర్వ సాధారణమని, అందులో ఆశ్చర్యమేం లేదని అన్నారాయన. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో అందరి ఏకాభిప్రాయంతోనే సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఆనవాయితీ అన్నది భట్టి చెప్పిన మాట. ఇక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ చెప్పడం పై టీపీసీపీ చీఫ్‌గా ఆయన ఆ మాట చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు.

కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపద కొంత మంది చేతుల్లోనే ఉండిపోయిందని.. కొత్త ఉద్యోగాల విషయం పక్కనపెడితే.. ఉన్న ఉద్యోగాలే భర్తీ చేయలేదంటూ భట్టి విక్రమార్క విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో మార్పులు తీసుకువస్తామని టీవీ9 మెగా పొలిటికల్ కాన్ క్లేవ్‌లో స్పష్టం చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే కార్ణాటకలో కరెంట్ కష్టాలు నెలకొన్నాయని.. కరెంట్ విషయంలో కర్ణాటకకు.. తెలంగాణకు పొంతనే లేదంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

భట్టి విక్రమార్క వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..