
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వే శాఖ. రైల్వే ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది. ” అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” (ఏబిఎస్ఎస్) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్‌లను అధునీకరించేందుకు సంకల్పించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి నిర్ణయించింది. వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్దిచేయడం జరుగుతుందని పేర్కొంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2023, ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌ల అధునీకరణకు రూపొందించని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా
అత్యాధునిక హంగులతో భద్రాచలంలో రోడ్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది భారత రైల్వే.
భారతదేశం వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబిఎస్ఎస్) కింద పునరాభివృద్ధి చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లలో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఒకటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్, భారతీయ రైల్వేల ప్రారంభ రోజుల నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది. ప్రారంభంలో ఈ స్టేషన్ సమీపంలోని గనుల నుండి నిజాం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బొగ్గును రవాణా చేయడానికి నిర్మించారు. కాలక్రమేణా, ఇది హైదరాబాద్, విజయవాడ, వరంగల్ సహా ఇతర ప్రధాన నగరాలను కలుపుతూ కీలకమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది.
ఈ స్టేషన్ ప్రముఖంగా భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఉంటూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ స్టేషన్ భద్రాచలం ఆలయ పట్టణానికి సమీపంలో ఉండటం వలన భక్తులు, ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ స్టేషన్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా విద్యుదీకరణ, భద్రాచలం రోడ్ – సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ ను దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తద్వారా బొగ్గు రవాణాను సులభతరం చేయడం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం సుమారు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలతో సహా ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరింత పునరాభివృద్ధి చేయడం జరుగుతోంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టే పనులు :
ఇక ఇప్పటివరకు మొత్తం 45 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి. రాబోయే కొన్ని నెలలలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..