Viral Video: బిడ్డ కోసం ఆరాటం.. ఏకంగా పెద్దపులితోటే ఫైటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..
నల్లమల అడవిలో, ఒక పెద్ద పులి ఎలుగుబంటి పిల్లపై దాడి చేసింది. అయితే, తల్లి ఎలుగుబంటి ధైర్యంగా పులికి ఎదురు తిరిగింది.. వెనకడుగు వేయకుండా ఎలుగుబంటి పెద్దపులిపై దాడి చేసింది. గట్టిగా అరుస్తూ, పులిని భయపెట్టి.. తన పిల్లను విడిపించుకుంది. ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఫర్హాబాద్ సమీపంలోని నల్లమల అటవీప్రాంతంలో జరిగింది.

నల్లమల అడవిలో, ఒక పెద్ద పులి ఎలుగుబంటి పిల్లపై దాడి చేసింది. అయితే, తల్లి ఎలుగుబంటి ధైర్యంగా పులికి ఎదురు తిరిగింది.. వెనకడుగు వేయకుండా ఎలుగుబంటి పెద్దపులిపై దాడి చేసింది. గట్టిగా అరుస్తూ, పులిని భయపెట్టి.. తన పిల్లను విడిపించుకుంది. ఈ ఘటన మంగళవారం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఫర్హాబాద్ సమీపంలోని నల్లమల అటవీప్రాంతంలో జరిగింది. అడవిలో సంచరిస్తుండగా పెద్దపులి కంట.. ఎలుగుబంటి పిల్ల పడింది.. దీంతో పెద్దపులి రెప్పపాటులో ఎలుగుబంటి పిల్లపై దాడి చేసి ఎత్తుకెళ్లింది.. అరుపులు విన్న తల్లి ఎలుగుబంటి.. ఒక్కసారిగా పులి మీదకు పరుగెత్తి.. పిల్లను విడిపించుకుంది.. ఆ తర్వాత అరుపులతో పెద్దపులి తరిమికొట్టింది.. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు సఫారీకి వెళ్లిన క్రమంలో ఈ దృశ్యాలు కంటపడ్డాయి.. దీంతో పర్యాటకులు వారి ఫోన్లలో చిత్రీకరించారు..
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ వీడియోను చూసి తల్లి ప్రేమంటే ఇదేనంటూ పలువురు పేర్కొంటున్నారు. ప్రమాదకరమైన పులికి.. ఎలుగుబంటి సవాల్ చేసి.. పిల్లను కాపాడటం మాతృత్వానికి ప్రతీకగా నిలిచింది.
వీడియో చూడండి..
సాధారణంగా, పులులు చాలా బలమైనవి, కానీ ఈ ఎలుగుబంటి తన త్యాగం ద్వారా ప్రకృతిలోని మాతృత్వ ప్రేమను చాటుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
