కరీంనగర్, ఫిబ్రవరి 06; కరీంనగర్ జిల్లా మానకొండుర్‌లో ఎలుగుబంటి హల్ చల్ సృష్టించింది.. కరీంనగర్, వరంగల్ రహాదారి ప్రక్కన ఉన్న వేప చెట్టుపైకి ఎక్కింది..స్థానికులు పొలిసులకి సమాచారం ఇవ్వడం తో ప్రజలని అప్రమత్తం చేసారు.. వెంటనే అటవీశాఖ అధికారులకి సమాచారం ఇచ్చారు.. పరిసర ప్రాంతాలలో ప్రజలు లేకుండా చూస్తున్నారు..వరంగల్ లోని రెస్క్యూ టీం కి సమాచారం అందించారు..పట్టుకోడానికి ప్రయత్నించిన అటవీ అధికారులను ఎనిమిది గంటలపాటు ముప్పతిప్పలు పెట్టింది.
ఎలుగుబంటి బరువు ఎక్కువగా ఉండడంతో వలలో చిక్కడం కష్టంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు భావించారు.. అందుకే ఎలుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించే ప్రయత్నం చేశారు. ఎలుగు బంటి ఆపరేషన్ ప్రారంభించడానికి రెండు గంటల సమయం పడుతుందన్నారు..
ఇదిలా ఉంటే, గతంలో అన్నారం ఈదులగట్టుల పల్లిలో స్థానిక ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి..ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు…జాతీయ రహదారి పక్కనే ఎలుగుబంటి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు.
ఎలుగుబంటి సంచారించిన ప్రాంతం లో ఇళ్ళ నుండి ప్రజలేవరూ బయటికి రావద్దంటూ హెచ్చరించారు. తరచూ ఈ ప్రాంతం లో ఎలుగు బంట్లు సంచారిస్తున్నాయని, నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..