Satavahana University: శాతవాహన యూనివర్శిటీ ఏరియాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. వర్శిటీ సిబ్బంది సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. యూనివర్శిటీలో వెనుక ఉన్న చిట్టడవిలో రెండు పెద్దబావుల వద్దకు నీటికోసం ఎలుగుబంట్లు వస్తాయని భావిస్తున్నారు. భల్లూకాన్ని బోనులో బంధించేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. యూనివర్శీటీలోని ఏయే ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందో అటవీశాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి అడుగుజాడలను గుర్తించారు. పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనులో భల్లూకానికి ఇష్టమైన అరటిపళ్ల గెలలను ఉంచారు. చెట్లు, పొదలు దట్టంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. పక్కనే ఉన్న కొండల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్థులు, వాకర్స్ అటువైపు వెళ్లొద్దని సూచించారు.
యూనివర్శిటీ ప్రాంగణంలో ఒకటే ఎలుగుబంటి ఉందా..? లేక మరిన్ని ఉన్నాయా..?
ఇంతకీ శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో ఒకటే ఎలుగుబంటి ఉందా..? లేక మరిన్ని ఉన్నాయా..? అనే కోణంలోనూ కూడా ఫారెస్టు సిబ్బంది దృష్టి పెట్టారు. భల్లూకాన్ని త్వరలో బంధిస్తామని…ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే రెండు ఎలుగుబంట్ల జాడలు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒకటి కాదు…రెండు కాదు…తనకు మూడు ఎలుగుబంట్లు కనిపించినట్లు ఓ విద్యార్థిని భయంతో చెబుతోంది. మొత్తానికి ఆపరేషన్ బంటి కొనసాగుతోంది. అయితే యూనివర్శిటీ ప్రాంగణంలోకి ఎలుగుబంటి ఎలా వచ్చిందనే కోణంపై ప్రధానంగా దృష్టి సారించారు ఫారెస్టు అధికారులు.
Also Read: Viral: ఉత్త రంగురాళ్లేమో అనుకున్నారు.. ల్యాబ్‌కి పంపి టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్