GHMC – Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ మాంసం విక్రయాలపై బల్దియా దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్నే కొనుగోలు చేయాలని నగర పౌరులకు అధికారులు సూచించారు. ఇటీవల గ్రేటర్ వెటర్నరీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూసిన నేపథ్యంలో నగర పౌరులను అధికారులు అలర్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో వేలాదిగా మాంసం దుకాణాలు నడుస్తున్నాయని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల పలు షాపులపై దాడులు చేసిన అధికారులు.. ఆ దాడుల్లో పాడైన, కల్తీ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే ఎక్కువగా కల్తీ మాంసం పట్టుబడింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు.. ప్రజలనూ అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆమోదించిన దుకాణాల్లోనే మాంసం కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కూడా జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన షాపుల్లోనే కొనాలని సూచించారు.
ఇకపోతే ఇటీవల నిబంధనలు అతిక్రమించిన 139 షాపులపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. 3 వేల కిలోలకు పైగా కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకునింది. కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్న షాపులపై రూ. 63,100 జరిమానా విధించినట్లు బల్దియా రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం నాడు కూడా బండ్లగూడ జాగీర్ కూడలిలోని ఓ హోటల్ లో బూజు పట్టిన మాంసం విక్రయించడాన్ని గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే, ఆకస్మిక తనిఖీలు చేసిన తొలిసారి గుర్తించినందున రూ. 5 వేలు జరిమాన వేసి, వార్నింగ్ ఇచ్చారు.
Also read:
Nora Fatehi: సత్యమేవ జయతే 2 నుంచి కుసు సాంగ్ రిలీజ్.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నోరా ఫతేహి..
Tragedy: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!