Bathukamma: విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి.. నేడు బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన.. వివరాలివే..

|

Oct 23, 2021 | 9:18 AM

Burj Khalifa - Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. ఖ్యాతిని ఈ రోజు విశ్వ వేదికపై ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం

Bathukamma: విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి.. నేడు బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన.. వివరాలివే..
Bathukamma
Follow us on

Burj Khalifa – Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. ఖ్యాతిని ఈ రోజు విశ్వ వేదికపై ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాటను ప్రదర్శించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర (స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బూర్జ్ ఖలీఫాపై మూడు నిమిషాల బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దీనిలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేయనున్నారు. ఈ వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం ప్రదర్శించనున్నారు.

బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కోసం కవిత ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్నారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చిన ఎల్‌ఈడీ తెరలపై రెండు సార్లు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు జాగృతి నాయకులు తెలిపారు.

Also Read:

JP Nadda: ఆ ఘనత మనకే సొంతం.. 100 కోట్ల వ్యాక్సినేషన్‌పై జేపీ నడ్డా కీలక వ్యాసం..

Telangana: లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ.. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు..