Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళనలు.. ప్రజాప్రతినిధులను తాకిన నిరసన సెగలు..

|

Jun 19, 2022 | 7:53 AM

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వెళ్లిన హరీశ్‌ రావు కాన్వాయ్‌ను, విద్యార్ధి సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళనలు..  ప్రజాప్రతినిధులను తాకిన నిరసన సెగలు..
Untitled 1
Follow us on

బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న అనిశ్చితి కంటీన్యూ అవుతోంది.  ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు  సఫలమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక ప్రకటన చేయగా, చర్చలు విఫలం అంటూ విద్యార్థుల‌ ట్విట్ కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే బాసర ట్రిపుల్ ఐటీ వద్ద స్టూడెంట్స్ ఆందోళన ముగియలేదు.. మాకు మీ మీద నమ్మకం లేదంటూ మంత్రి‌ ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి‌ సబితల కామెంట్స్ పై విద్యార్థులు సమాధానంగా ట్విట్ చేశారు.  12 డిమాండ్లలలో ఏ ఒక్క డిమాండ్ పై స్పష్టమైన హామీ ఇవ్వలేదని‌ ప్రకటించారు విద్యార్థులు.  హామీ పత్రం విడుదల చేసిన మరుక్షణమే ఆందోళన విరమిస్తామని ట్విట్ చేశారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ మంత్రులకు వరుసగా  నిరసన సెగలు తగులుతున్నాయి.  నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్‌ రావుకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వెళ్లిన హరీశ్‌ రావు కాన్వాయ్‌ను, విద్యార్ధి సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. బాసర ట్రిపుల్‌ ఐటీ సమస్యలపై స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్ధులను అరెస్ట్ చేసిన పోలీసులు, స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే, అటు వికారాబాద్ జిల్లా పరిగిలోనూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. బహార్ పేట చౌరస్తాలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాసర ఐఐటీ విద్యార్థుల పట్ల మంత్రి సబిత మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలియజేశారు. ఇటు పరిగి మార్కెట్ యార్డులోనూ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన సబితను మహిళలు అడ్డుకున్నారు. పేరుకే మిషన్ భగీరథ అని, నీళ్లు మాత్రం రావడం లేదంటూ నిలదీసింది ఓ మహిళ. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో భాగంగా పరిగిలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, నిరసనలు ఎదురయ్యాయి. మొన్న మంత్రి హారీష్, నిన్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, తాజాగా, సబితకు వరుసగా నిరసన సెగలు తగిలాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి