Basara Fire Accident: పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం.. నాలుగు బైక్‌లతో సహా పలు వస్తువులు దగ్ధం.. పూర్తి వివరాలివే..

Basara Fire Accident:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కల్యాణ మండపంలో వివాహ వేడక జరుగుతుండగా.. పెళ్లి అనంతరం స్నేహితులు, బంధువులు టపాసులు పేల్చారు. ఆ సమయంలో టపాసులు పేలి టెంట్ హౌస్‌కు..

Basara Fire Accident: పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం.. నాలుగు బైక్‌లతో సహా పలు వస్తువులు దగ్ధం.. పూర్తి వివరాలివే..
Basara Vehicle Fire Accident

Updated on: May 17, 2023 | 6:30 AM

Basara Fire Accident:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం కల్యాణ మండపంలో వివాహ వేడుక జరుగుతుండగా.. పెళ్లి అనంతరం స్నేహితులు, బంధువులు టపాసులు పేల్చారు. ఆ సమయంలో టపాసులు పేలి టెంట్ హౌస్‌కు నిప్పు అంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. బంధువులు, స్నేహితులు, వధూవరులను బయటకు తీసుకవచ్చారు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.

అయితే ఆ నాలుగు బైక్‌లు, అక్కడే ఉన్న కొన్ని కుర్చీలు, రెండు టెంట్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్ హాల్లో టపాసులు పేల్చకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..