సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించిన నష్టం కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫెమస్ అయ్యారు. సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బందిపడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మరు మ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకు ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
దాంతో రాజకీయాల వైపు అడుగులేసింది.. బర్రెలక్కాకు కేవలం 5000 ఓట్లు మాత్రమే పడ్డాయి. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కాకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమెపై ఎంత సింపతీ వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థంబ్నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు.
అలా తనపై ట్రోలింగ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బర్రెలక్క. తనపై అసభ్యకర వీడియోలు చేస్తూ.. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బర్రెలక్క.. తన పెళ్లయ్యిందంటూ.. భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు. ఆ వ్యక్తి పట్టుకొని నిలదీసింది బర్రెలక్క. నేను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వీడే. మా నాన్నతో వీడియో చేయించి వీడియోలో షేర్ చేశాడు. దాంతో చాలా మంది పిచ్చి పిచ్చి థంబ్ సెల్స్ పెట్టి నా గురించి వీడియోలు చేశారు. నా పరువు పోవడానికి వీడే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బర్రెలక్క. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.