High Court: 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని పిటిషన్ వేసిన బర్రెలక్క.. ఈమె గురించి పూర్తి వివరాలు

|

Nov 24, 2023 | 12:53 PM

మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు. తుది తీర్పు ప్రజలదే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చాలా మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు చేయాలని భావిస్తున్నారు. అందులో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క (శిరీష) అనే యువతి ఎన్నికల బరిలో నిలిచారు.

High Court: 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని పిటిషన్ వేసిన బర్రెలక్క.. ఈమె గురించి పూర్తి వివరాలు
Telangana High Court has direct the DGP to provide security to Kolhapur's independent candidate Barrelakka
Follow us on

మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు. తుది తీర్పు ప్రజలదే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చాలా మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు చేయాలని భావిస్తున్నారు. అందులో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క (శిరీష) అనే యువతి ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ వేసేందుకు సిద్దమైన రోజు మొదలు నేటి వరకూ ఆమెకు బెదిరింపులు, దాడులు ఎదరువుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు ఈ యువతి. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నేను ఓట్లు చీల్చుతాననే భయంతోనే కొందరు నాపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో, వారు ఏ పార్టీకి చెందిన వారో కూడా తనకు తెలుసన్నారు. కానీ వాళ్ల వివరాలు ఇప్పుడు వెల్లడించనన్నారు. ప్రాణం పోయినా ఈ పోరాటంలో వెనుకడుగు వేయను’ అంటున్నారు. ‘నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. భవిష్యత్తులో 1000 అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా అన్నారు. యవతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుందని తెలిపారు. నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే యువకుడిని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. తనకు అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇలాంటివి ఎన్ని సంఘటనలు ఎదరురైనా నేను దేనికీ భయపడను’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తనపై జరిగిన దాడిని ఖండిస్తూ.. తనకు భద్రతను కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెకు మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల అండగా ఉంటామని ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బర్రెలక్కకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరుతామన్నారు. గతంలో జరిగిన దాడి నేపథ్యంలో తనకు 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క (కర్నె శిరీష) హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఈమెకు భద్రత కల్పించాలని తీర్పు వెలువరిస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

బర్రెలక్క కొన్నేళ్ల క్రితం గేదెలు కాస్తూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఎన్ని డిగ్రీలు చదివినా ఉద్యోగం రావడంలేదంటూ.. అందుకే గేదెలు కాస్తున్నా అని కామెంట్ పెట్టారు. దీంతో తెగ వైరల్‌గా మారిపోయారు. తాను వాస్తవానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ వేసే సమయానికి తన చేతిలో రూ. 5వేలు, బ్యాంకులో రూ. 1500 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి వాహనాలు, ఆస్తులు, అప్పులు లేవని తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి ఐపీసీ 505(2) కింద కేసు నమోదైనట్లు చెప్పారు.

నిరుద్యోగమే ప్రధాన అస్త్రంగా ఎన్నికల బరిలోకి దిగినట్లు వివరించారు. తన మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందులో ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేలా పోరాటం చేస్తానన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యో్గ భృతి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, ఉచిత వైద్యం, విద్యతో పాటూ నిరుద్యోగులకు ఉచితంగా ప్రత్యేక కోర్సులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తానని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క (శిరీష)కు ఇన్‌స్టాగ్రాంలో 5.73 లక్షలు, ఫేస్‌బుక్‌లో 1.07 లక్షల ఫాలోవర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక యూట్యూబ్‌లో 1.59 లక్షల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..