Bank Holidays in July 2021: జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే..

|

Jun 29, 2021 | 7:06 AM

Bank Holidays in July 2021: సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా బ్యాంకులు నిర్ణీత సమయంలో తమ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. కరోనా కొత్త కేసులు తగ్గున్నాయి కానీ పరిస్థితి..

Bank Holidays in July 2021: జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే..
Bank Holidays
Follow us on

Bank Holidays in July 2021: సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా బ్యాంకులు నిర్ణీత సమయంలో తమ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. కరోనా కొత్త కేసులు తగ్గున్నాయి కానీ పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఇటువంటి పరిస్థితిలో జులై లో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి.. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.జూలైలో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలను చేసుకునే వినియోగదారులకు సెలవు దినాలు తెలుసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటే.. పనికి సులభంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో జూలైలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేసే దినాలు ఎన్ని.. సేవలు దినాలు ఎన్నో తప్పనిసరిగా తెలుసుకోవాలిన అవసరం ఉంది.

జూలైలో మొత్తం 31 రోజులుండగా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు. ప్రతి ఆదివారం, రెండో శనివారం , నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయనే సంగతి తెలిసిందే. దీంతో ప్రతి నెలలో 6 లేదా 7 రోజులు సెలవులు తప్పనిసరిగా ఉంటాయి. ఇక పండగలు, పర్వదినాల్లో బ్యాంకులకు సెలవులు వస్తాయి. జులై లో 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు 10 రెండో శనివారం, జూలై 24 నాలుగో శనివారం వచ్చాయి. ఈ తేదీల్లో బ్యాంకులు తెరచుకోవు. ఈ నెలలో బక్రీద్ పండగ ఉన్న నేపథ్యంలో ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. అంటే జూలై 20 మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూలైలో ఒకేఒక్క ఫెస్టివల్ హాలిడే వచ్చింది. అంటే జులై మొత్తం లో బ్యాంకులకు ఏడు రోజులు సెలవులు మిగిలిన రోజులు పని దినాలు

ఇదిలా ఉంటే.. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి.

Also Read: అలంకార ప్రియుడు మలయప్పస్వామిని రోజూ ఏయే ఆభరణాలతో అలంకరిస్తారో తెలుసా