Bandi Sanjay: బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసు.. సీఎం ఎందుకు ఆహ్వానించలేదు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

|

Jun 01, 2024 | 5:06 PM

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.. దీనికోసం ఇప్పటికే.. కసరత్తులు పూర్తిచేసింది. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, పలు ప్రధాన పార్టీలకు ఆహ్వానాలను సైతం పంపింది. మాజీ సీఎం కేసీఆర్ తోపాటు పలువురు ఉద్యమకారులను సన్మానించేందుకు ఆహ్వానాలను అందజేసింది.

Bandi Sanjay: బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసు.. సీఎం ఎందుకు ఆహ్వానించలేదు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us on

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.. దీనికోసం ఇప్పటికే.. కసరత్తులు పూర్తిచేసింది. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, పలు ప్రధాన పార్టీలకు ఆహ్వానాలను సైతం పంపింది. మాజీ సీఎం కేసీఆర్ తోపాటు పలువురు ఉద్యమకారులను సన్మానించేందుకు ఆహ్వానాలను అందజేసింది. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసుని.. అలాంటప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు బీజేపీ నేతలను సీఎం రేవంత్ ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అధికార చిహ్నంలో చార్మినార్‌ ఉండొద్దనేది తమ విధానమని స్పష్టంచేశారు. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.

కాంగ్రెస్‌ పెద్దలను కేసీఆర్‌ మచ్చిక చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. అందుకే దర్యాప్తులు ముందుకు కదలడం లేదని బండి సంజయ్‌ కామెంట్ చేశారు.

తెలంగాణను కేసీఆర్‌ అప్పులకుప్ప చేశారని.. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్‌ నడుస్తోందని బండిసంజయ్‌ ఆరోపించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..