Watch Video: కిరాయి కోసం ఇంతటి కిరాతకమా.. ఏకంగా కళ్యాణ మండపంలోనే
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఫంక్షన్ హాల్ కిరాయి అడిగినందుకు యాజమాన్యంపైనే దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్ లీజు విషయంలో ఈ రగడ జరిగింది. ఆ ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వ్యక్తులపై దాడి జరిగింది. గత సంవత్సరకాలంగా ఫంక్షన్ హాల్‌కి రెంట్ చెల్లించలేదని అడగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం కోర్టు వరకూ వెళ్లింది. అయితే కోర్టు సైతం యజమాన్యానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఫంక్షన్ హాల్ కిరాయి అడిగినందుకు యాజమాన్యంపైనే దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్ లీజు విషయంలో ఈ రగడ జరిగింది. ఆ ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వ్యక్తులపై దాడి జరిగింది. గత సంవత్సరకాలంగా ఫంక్షన్ హాల్‌కి రెంట్ చెల్లించలేదని అడగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం కోర్టు వరకూ వెళ్లింది. అయితే కోర్టు సైతం యజమాన్యానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ స్థలం తమకే చెందుతుందని ఫంక్షన్ హాల్ ఖాళీ చేయవలసిందిగా అద్దెకు ఉన్న వ్యక్తులతో యజమాని చెప్పాడు. అయితే.. దీనికి ఒప్పుకోకుండా 8 మంది ఒక్కచోట చేరి కట్టెలు, రాడ్లు, సీసాలతో ఫంక్షన్ హాల్ యజమానిపై తీవ్రంగా దాడికి దిగారు.
దీంతో బాధితులు బండ్లగూడ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం అందించి తమపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై తగిన విధంగా చర్యలు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

