Bandi Sanjay: అదంతా తప్పుడు ప్రచారం.. మా పార్టీలో అలాంటి లీకులు ఎప్పుడూ ఉండవన్న బండి సంజయ్..

|

Jun 11, 2023 | 9:29 AM

Telangana BJP: బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుందన్నారు. బీఆర్​ఎస్​ను ధైర్యంగా ఎదుర్కోగలిగేది బీజేపీ మాత్రమే అని అన్నారు. మాకు బీఆర్ఎస్​తోనే పోటీ. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది..? ఒక్కో నియోజకవర్గంలో మా పార్టీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నారు. కానీ కాంగ్రెస్​కు హుజూరాబాద్​ సహా అనేక చోట్ల అభ్యర్థులే దిక్కులేరని అన్నారు బండి సంజయ్..

Bandi Sanjay: అదంతా తప్పుడు ప్రచారం.. మా పార్టీలో అలాంటి లీకులు ఎప్పుడూ ఉండవన్న బండి సంజయ్..
MP Bandi Sanjay Kumar
Follow us on

తనను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగిస్తారని, కేంద్రమంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మా పార్టీలో అలాంటి లీకులు ఎప్పుడూ ఉండవని అన్నారు అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయా? కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికైనా దక్కినప్పుడు వారి పేర్లు బయటకు వచ్చాయా..? అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ ఇష్టాగోష్టిలో మాట్లాడారు. బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుందన్నారు. బీఆర్​ఎస్​ను ధైర్యంగా ఎదుర్కోగలిగేది బీజేపీ మాత్రమే అని అన్నారు. మాకు బీఆర్ఎస్​తోనే పోటీ. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది..? ఒక్కో నియోజకవర్గంలో మా పార్టీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నారు. కానీ కాంగ్రెస్​కు హుజూరాబాద్​ సహా అనేక చోట్ల అభ్యర్థులే దిక్కులేరని అన్నారు.

సీఎం కేసీఆర్ ​నిర్మల్​కు వెళ్లి కాంగ్రెస్​ను విమర్శించారు. కానీ, అక్కడ ఆ పార్టీకి అభ్యర్థే లేడు. కాంగ్రెస్ ​గ్రాఫ్​పెంచడానికే ఆ పార్టీపై సీఎం కేసీఆర్ ​విమర్శలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిందని సర్వేలో తేలడంతో సీఎం కేసీఆర్ వ్యూహం మార్చాడని అన్నారు. ఆ పార్టీకి హుజురాబాద్ లో అభ్యర్థి కూడా లేడు. మా పనిని మేము చేసుకుంటూ వెళ్తాం. కాంగ్రెస్‌లో ఇక్కడి నుంచి కాకపోతే పాకిస్తాన్ నుంచి అయినా చేర్చుకోనివ్వండి.. మాకేం ఇబ్బంది లేదు. కేసీఆర్ చేయించుకున్న సర్వేలో బీజేపీకి ఆదరణ పెరిగిందని తేలిందన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే తేలిందన్నారు. అందుకే బీజేపీకి భయపడి కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేది తప్పుడు ప్రచారమని ఉప ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్​కు కాంగ్రెస్​ ఆల్టర్నేట్​ అయితే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​పై విమర్శలు చేయొద్దని మాకు ఎవరూ డైరెక్షన్ ​ఇవ్వలేదు. బీఆర్ఎస్​తో కలిసి పనిచేస్తామని గతంలో జానారెడ్డి, కోమటి రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలే చెప్పాలని అన్నారు బండి సంజయ్​.

కవితపై ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. ఆ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.. ఆధారాలు సేకరిస్తున్నాయి. దొంగలు ఎవరైనా మోదీ సర్కారులో తప్పించుకోలేరన్నారు. చార్జిషీట్‌లో పేరు లేకుంటే బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం కుదరినట్లా? కేసీఆర్ లాగా సిట్ వేసి దాన్నిచంకలో వేసినట్లు తిరగడం అనుకుంటే అది సరికాదన్నారు. సీబీఐ, ఈడీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు చేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

విచారణ పూర్తికాకముందే అరెస్టు చేయాలంటే ఎలా? కేసీఆర్‌ను ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు పది మంది కూడా లేరని కామెంట్లు చేశారు. కానీ 48 స్థానాలు గెలిచి మా సత్తా చూపించమని అన్నారు.

కమలం పువ్వు గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. జాయినింగ్స్ కోసం ఎవరో వస్తారని ఎదురుచూడమని అన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం కావాలని కోరుకుంటామన్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ ముఖంతో గెలిచారా? ఆయన ఫొటోతో గెలిచిందని కాంగ్రెస్ చెప్పగలదా? రాహుల్ ఇమేజ్ తో అయితే గుజరాత్, యూపీలో ఎందుకు గెలవలేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం