Yadadri Temple: ‘ఆలయాలు వ్యాపార కేంద్రాలా..’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

| Edited By: Ravi Kiran

Jan 17, 2023 | 12:58 PM

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బండి సంజయ్‌. కేసీఆర్‌ కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆరోపించారు.

Yadadri Temple: ఆలయాలు వ్యాపార కేంద్రాలా.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
Sanjay Vs Ktr
Follow us on

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఇప్పుడు రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన అనంతరం సిఎం కేసిఆర్ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తిరుమల తరహాలో పునర్మించారు. అయితే ఇటీవల మంత్రి కేటిఆర్ ఓ సందర్భంలో యదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని అభివృద్ధి చేసిన  విషయంపై ఓ మీటింగ్ లో ప్రస్తావించారు. ఇదే విషయంపై తెలంగాణ బిజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బండి సంజయ్‌. కేసీఆర్‌ కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి కూడా పెట్టుబడేనా, భక్తుల విరాళాల కోసమే అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై మొన్న దావోస్‌లో NRIల మీటింగ్‌లో మాట్లాడారు కేటీఆర్‌. ఆ వీడియోను షేర్‌ చేశారు బండి సంజయ్‌. ఈ వ్యాఖ్యలనే తప్పుబడుతూ విమర్శలు చేశారు బండి. ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడం ఎలా అన్నది చూపించడం కోసమే ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారా అని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..