Bandi Sanjay: పిల్లలతో రాజకీయాలు చేయడమేంటి.. పిల్లలు పిల్లలు కొట్టుకుంటే నాన్‌ బెయిలబుల్ కేసులా.. బండి సంజయ్ ఫైర్..

|

Jan 18, 2023 | 6:56 AM

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమారుడు భగీరథపై కేసు ఘటనలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పిల్లలతో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. కుమారుడిపై...

Bandi Sanjay: పిల్లలతో రాజకీయాలు చేయడమేంటి.. పిల్లలు పిల్లలు కొట్టుకుంటే నాన్‌ బెయిలబుల్ కేసులా.. బండి సంజయ్ ఫైర్..
Bandi Sanjay
Follow us on

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమారుడు భగీరథపై కేసు ఘటనలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పిల్లలతో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. కుమారుడిపై కేసు నమోదు కావడంపై సీరియస్ గా స్పందించారు. ఓ విద్యార్థిపై బండి సంజయ్ కుమారుడు చేసిన దాడి ఘటనపై బాలానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేంద్ర వర్సిటీ కమిటీ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అంతలోనే బాధితుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బండి భగీరధ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బాధితుడు శ్రీరామ్‌. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని స్పష్టం చేశాడు. పాత వీడియోను ఇప్పుడు ఎందుకు బయటపెట్టారో తెలియదన్నాడు బగిరథ్ ఫ్రెండ్ శ్రీరామ్‌.

మరోవైపు తన కుమారుడు భగీరథపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్‌ తనతో రాజకీయాలు చేయాలేతప్ప పిల్లలతో రాజకీయాలేంటని మండిపడ్డారు. పిల్లలు కొట్టుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గతంలో సీఎం మనుమడిపై కామెంట్లు చేస్తే.. తానే స్వయంగా ఖండించానని, ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.

కాగా.. ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై కేసు నమోదు చేసినట్లు దుందిగల్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. విద్యార్థిపై బండి భగీరథ్ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్యలు తీసుకున్నారు. ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..