Cross fire with Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా టీవీ9 క్రాస్ ఫైర్ షోలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ప్రజల్లో ఈ విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తామని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టి.. బీజేపీ జెండాను ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్యూచర్ ఇలా ఉండబోతోందంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారాన్ని నిలుపుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ను విమర్శించిన ఆయన.. తెలంగాణ సెంటిమెంట్‌కు దేశభక్తి, జైశ్రీరామ్ నినాదాన్ని జోడించామని చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేందని చెబుతున్నారు బండి సంజయ్. మరి ఈ క్రాస్ ఫైర్‌లో బండి సంజయ్ ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారో ఈ కింది వీడియోను చూడండి..
Also read:
అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!
Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!
పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?