Bala Latha: సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు.. స్మితా సబర్వాల్‌కు బాలలత కౌంటర్..

|

Jul 22, 2024 | 12:52 PM

Bala Latha on Smita Sabharwal: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్‌ఫాం 'ఎక్స్'లో పంచుకున్నారు. అది ఒకే ఒక్క ట్వీట్‌.. కానీ.. అగ్గి రాజేసింది.

Bala Latha: సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు.. స్మితా సబర్వాల్‌కు బాలలత కౌంటర్..
Smita Sabharwal Balalatha
Follow us on

Bala Latha on Smita Sabharwal: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో పంచుకున్నారు. అది ఒకే ఒక్క ట్వీట్‌.. కానీ.. అగ్గి రాజేసింది. వివాదాస్పందంగా మారి ఎందరో మనోభావాల్ని దెబ్బతీసింది. తెలంగాణలో సీనియర్‌ IAS ఆఫీసర్‌గా ఉన్న స్మిత సభర్వాల్ పై సోషల్‌ మీడియా తోపాటు.. పులువురు ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్‌కు మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మాట్లాడిన మాజీ బ్యూరోక్రాట్ బాలలత.. స్మితా సబర్వాల్‌కు ఛాలెంజ్ చేశారు. ఇద్దరం ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం.. అంటూ ఛాలెంజ్ చేశారు.

తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మితా సిద్ధమా అంటూ సవాల్ చేశారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నారు. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని.. ఆమె మాటలు దురదృష్టకరమన్నారు. అసలు దివ్యంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? అంటూ ప్రశ్నించారు. పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరన్నారు. స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి? స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? అంటూ ప్రశ్నించారు.

వీడియో చూడండి..

స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలని బాలలత కోరారు. స్మిత ట్వీట్ తాను దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోందని.. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందన్నారు. జైపాల్ రెడ్డికి కాళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారులే అయన్ని నడిపించారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మిత కి ఎవరు చెప్పారు? సీఎం, సీఎస్ ఆలోచించి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. స్మిత లాంటి ఆఫీసర్ కి కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థం అవుతుందని.. ఆమె వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలన్నారు.

స్మితాపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని.. బాలలత డిమాండ్ చేశారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలను స్ఫూర్తిగా ట్యాంక్ బండ్ పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుంది, స్మితకు సీఎస్ షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్ లు స్పందించాలని.. స్మిత సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యాంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా? అని ప్రశనించారు. స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే.. పర్సనల్ లైఫ్, రీల్స్ గురించి నేను మాట్లాడనన్నారు. ఆమె తమ కమ్యూనిటిపై మాట్లాడినందుకు రీయాక్ట్ అయ్యానని.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందంటూ పేర్కొన్నారు.

చాలా మంది ఉద్యోగులకు పనిలేకనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని.. సివిల్ సర్వీస్‌ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని బాలలత పేర్కొన్నాురు. 24 గంటల్లో స్మిత సబర్వాల్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే దివ్యాంగుల సమాజం ఆందోళనకు దిగుతుందన్నారు. ఖేడ్కర్ ఎపిసోడ్‌ను దివ్యాంగులందరికి వర్తింపచేస్తే ఎలా? అంటూ మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..