
తెలంగాణలోని నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ (58) అనే మహిళను తీవ్రమైన కడుపు నొప్పితో సతమతం అవుతూ ఉండటంతో.. మూడు రోజుల క్రితం భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రి డాక్టర్లను ఆశ్రయించారు. టెస్టులు చేసిన మెడికల్ టీం చిన్నమ్మ కడుపులో 6 కిలోల బరువున్న కణితి ఉన్నట్లు గుర్తించింది.
డాక్టర్ ఆ. పూర్వ రజనీకాంత్, డాక్టర్ ప్రీతి నేతృత్వంలో ప్రత్యేక డాక్టర్ల టీమ్ బాధిత మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించింది. సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కడుపులోని పెద్ద కణితిని తొలగించి.. మహిళ ప్రాణం నిలెబెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, బాధితురాలు త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశముందన్నారు9.
అరుదైన ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కాశీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. భైంసా ఆసుపత్రి డాక్టర్లు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ఆయన ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..