
అతనో సామాన్య ఆటో డ్రైవర్.. కట్ చేస్తే.. రాజకీయాల్లోకి అరంగ్రేటం.. బీఆర్ఎస్ పై అభిమానంతో.. 2019లో ఆ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించాడు.. ఆ తర్వాత.. 2023 లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరి.. ఏకంగా కార్పోరేషన్ మేయర్ అయ్యాడు. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణలోనే జరిగింది.. కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ పదవి మూడ్ గణేష్ ను వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ పీఠం సిపిఐ కైవసం చేసుకుంది. మేయర్ పదవి కాంగ్రెస్, సిపిఐ చెరి రెండున్నరేళ్లు ఒప్పందం చేసుకున్నాయి. ఎస్టీ జనరల్ కావడంతో మూడ్ గణేష్ సిపిఐ మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే.. కొత్తగూడెంలో సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా) చరిత్ర సృష్టించింది. ఆటో డ్రైవర్ నుంచి మేయర్ వరకు ఎదిగిన.. మూడ్ గణేష్.. తెలంగాణలో తొలిసారి సీపీఐ పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యాడు. పేద కుటుంబం నుంచి వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ.. సిపిఐలో చేరి మేయర్ గా కొత్తగూడెం తొలి పౌరుడుగా ఎన్నిక కావడం పట్ల స్థానికులు, పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
వందేళ్ల చరిత్ర గల సీపీఐ.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సీపీఐ కి ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడం మేయర్ పదవి వరించింది. తొలి మేయర్ గా సీపీఐ నేత మూడ్ గణేశ్ (33) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్ గా పని చేసిన మూడ్ గణేశ్ సొంతూరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి..
Kothagudem Municipal Corporation
కోమటిపల్లిలో పేద కుటుంబంలో పుట్టిన గణేష్.. తన కుటుంబ పోషణ కోసం ఆటో నడిపాడు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న గణేష్.. కోమటిపల్లి స్థానానికి ఎంపీటీసీగా పోటీ చేశారు. బిఆర్ఎస్ పై అభిమానంతో 2019 లో ఎంపిటిసిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపిటిసిగా ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి.. 2023 లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. గణేష్ గ్రామం కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం అయింది. ఫిబ్రవరి11న జరిగిన ఎన్నికల్లో సిపిఐ టికెట్ ఇవ్వడంతో 20వ డివిజన్ నుంచి ఆయన పోటీ చేసి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్ పదవిని ఎస్టీలకు రిజర్వు అయింది. అయితే.. సీపీఐ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నికైనా గణేశ్ ను మేయర్ పదవి వరించింది.. ఆయనకు భార్య సింధు, కొడుకు సాత్విక్ ఉన్నారు. వందేళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సీపీఐ నేతగా మేయర్ గా ఎన్నికైన అరుదైన అవకాశం మూడ్ గణేష్ కే దక్కింది…
2022లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి గతేడాది పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కూనంనేని… ఇటీవలే ‘ఖమ్మం వేదికగా సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాజాగా కొత్తగూడెం మేయర్ సీపీఐ నేత మూడ్ గణేశ్ ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించారు.
కార్పొరేషన్లో 60 డివిజన్లలో కాంగ్రెస్, సీపీఐ చెరో 22, బీఆర్ఎస్ 8. ఆరుగురు స్వతంత్రులు, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్ గెలుచుకున్నాయి.. చెరి సమానంగా సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగూడెం మేయర్ పదవి పై ఉత్కంఠ నెలకొంది.. మేయర్ పదవి కోసం కాంగ్రెస్, సిపిఐ తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి.. ఐదుగురు ఇండిపెండెంట్ లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ బలం 27 కు చేరింది. అయితే.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగంగా సీపీఐ మ అయితే సిఎం, పిసిసి అధ్యక్షుడు తో సిపిఐ నేతలు చర్చలు జరిపి.. చేరి రెండున్నరేళ్లు మేయర్ పదవి పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి.. మొదటి గా రెండున్నర సంవత్సరాలు సిపిఐ మేయర్, ఆ తర్వాత కాంగ్రెస్ చేపట్టనున్నాయి. రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో ఊహించడం కష్టం.. అనేక మలుపులు తిరిగి ఉత్కంఠ రేపిన కొత్తగూడెం మేయర్ పదవి ఆటో డ్రైవర్ టూ మేయర్ గా మూడ్ గణేష్ కు దక్కింది.. గణేష్ ను గ్రామస్థులు, బంధువులు, పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.