వేలం వేస్తున్నాం.. పాల్గొనదలచినవారు సంప్రదించండి

|

Jul 08, 2020 | 11:34 AM

Auctioning off Useless Items at The Cyberabad Commissionerate :సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని స్టోర్‌ విభాగంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. పలు ఎలక్ట్రానిక్ వస్తువులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటిలో కంప్యూటర్, ఏసీతోపాటు పలు వస్తువులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఏసీ, కంప్యూటర్‌ చైర్స్‌, టేబుల్‌, డెస్క్‌టాప్‌ సెట్‌, బ్లూటూత్‌ ప్రింటర్స్‌, ఎక్సటర్నల్‌ హార్డ్‌ డిస్క్‌, ల్యాండ్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్స్‌, పవర్‌ బ్యాటరీస్‌, యూపీఎస్‌ తదితర వస్తువులను వేలం […]

వేలం వేస్తున్నాం.. పాల్గొనదలచినవారు సంప్రదించండి
CP Sajjanar Review Ovar QNET Scam
Follow us on

Auctioning off Useless Items at The Cyberabad Commissionerate :సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని స్టోర్‌ విభాగంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. పలు ఎలక్ట్రానిక్ వస్తువులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటిలో కంప్యూటర్, ఏసీతోపాటు పలు వస్తువులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

ఏసీ, కంప్యూటర్‌ చైర్స్‌, టేబుల్‌, డెస్క్‌టాప్‌ సెట్‌, బ్లూటూత్‌ ప్రింటర్స్‌, ఎక్సటర్నల్‌ హార్డ్‌ డిస్క్‌, ల్యాండ్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్స్‌, పవర్‌ బ్యాటరీస్‌, యూపీఎస్‌ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఈనెల (జులై 11) 11వ తేదీ ఉదయం 11 గంటలకు 9490617324 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని ఓ ప్రటనలో సీపీ సజ్జనార్ తెలిపారు.