AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌక‌ర్యం..

తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబ‌ర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్న‌ప‌ల్లి మండ‌లం రంగంపేట‌లో 307 మంది గిరిజ‌న రైతుల‌కు ప‌ట్టాలు పంపిణీ...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌక‌ర్యం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2020 | 12:00 PM

Share

తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబ‌ర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్న‌ప‌ల్లి మండ‌లం రంగంపేట‌లో 307 మంది గిరిజ‌న రైతుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. అనంత‌రం మాట్లాడిన ఆయ‌న‌.. రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబ‌ర్ ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌ని, ఇంటింటికీ ఇంటెర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు. అలాగే భవిష్య‌త్తులో ఆక్సిజ‌న్ కొర‌త ఉండ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతోనే సీఎం కేసీఆర్ హ‌రితహారం కార్య‌క్ర‌మాన్ని తెచ్చార‌ని అన్నారు. చెట్ల‌ను ఇష్టారీతిన న‌రికితే భ‌విష్య‌త్తులో స్వ‌చ్ఛ‌మైన గాలిని కొనుక్కోవ‌ల్సి వ‌స్తుంద‌న్నారు.

వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని.. ఇందుకోసం 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ఇక దేశంలో ఎక్క‌డా లేని విధంగా వ్య‌వ‌సాయానికి 24 గంట‌లు ఉచిత క‌రెంటును అందిస్తున్నామ‌ని చెప్పారు కేటీఆర్. అలాగే క‌రోనా వంటి క‌ష్ట కాలంలోనూ రైతుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం.. రూ.7,200 కోట్లను రైతుల‌ బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఎలాంటి ఎన్నిక‌లు లేవ‌ని, పూర్తిగా రాష్ట్ర‌ అభివృద్ధిపై దృష్టి సారిస్తామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?