అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోంది.. దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టండిః హరీష్ రావు

అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. సిట్‌ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోంది.. దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టండిః హరీష్ రావు
Brs Mla Harish Rao

Updated on: Jan 20, 2026 | 7:34 PM

అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. సిట్‌ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో ముగ్గురు అధికారులు విచారణ చేశారని వెల్లడించారు.

గడిచిన 24గంటలుగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ మరింత స్పీడప్ కావడమే కాకుండా పొలిటికల్ దుమారానికి దారి తీసింది. మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం.. ఆయన విచారణకు హాజరుకావడం.. అన్నీ గంటల్లోనే జరిగిపోయాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్‌ అధికారులు హరీష్‌రావుకు నోటీసులు పంపించడంతో ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటలకు వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.

అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసుల ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావును సిట్‌ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి విచారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..