Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో..

జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో స్పీకర్ పోచారం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో..
Pocharam Srinivas Reddy

Updated on: Aug 16, 2022 | 9:15 PM

Speaker Pocharam Srinivas Reddy: కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో స్పీకర్ పోచారం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు మంగళవారం రాత్రి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు. తమ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని స్పీకర్ సూచించినట్లు తెలుస్తోంది.

కాగా.. అంతకుముందు కూడా తెలంగాణ శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. 2021 నవంబర్ చివర్లో తన మనుమరాలి వివాహ వేడుకల అనంతరం ఆయనకు కరోనా సోకింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..