
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు గెజిట్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి. దానం నాగేందర్‌పై 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 191(2) పదో షెడ్యూల్ ప్రకారం దానంపై అనర్హత వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 18న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నికల జరగనుంది.