KTR: 20 ఏళ్లలో కేటీఆర్‌ ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..

|

May 25, 2022 | 6:05 AM

KTR: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సోషల్‌ మీడియాలో (Social Media) ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంటూ ...

KTR: 20 ఏళ్లలో కేటీఆర్‌ ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..
Telangana Minister KTR
Follow us on

KTR: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సోషల్‌ మీడియాలో (Social Media) ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంటారు మంత్రి. ఇక కేటీఆర్‌కు విదేశల్లోనూ అభిమానులున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఫారిన్‌ టూర్‌లకు వెళ్లినప్పుడు అక్కడ లభించే ఆదరణే దీనికి ఉదాహరణ చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దాదోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో కేటీఆర్‌ బిజీబిజీగా గడుపుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే వేటలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ ఆశా జడేజా మోత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసిన ఆమె ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.

మోత్వాని ట్వీట్‌ చేస్తూ.. ’20 ఏళ్లలో కేటీఆర్‌ దేశ ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆలోచనల్లో ఉన్న స్పష్టత, దాన్ని అర్థమయ్యేలా విడమరిచి చెప్పగలిగే నైపుణ్యత ఉన్న ఒక యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. దావోస్‌లో తెలంగాణ టీమ్‌ దూసుకుపోతోంది. వీరిని చూస్తుంటే ఈ రోజు బిలియన్‌ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ ఆమె రాసుకొచ్చారు.

దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కేటీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆశా జడేజా ఎవరనేగా.. 2000లో సిలికాన్‌ వ్యాలీలో స్టార్టప్‌ ప్రారంభించిన ఈమె, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకు పైగా టెక్‌ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..