Asaduddin Owaisi: హర్యానా ఫలితాలపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

|

Oct 09, 2024 | 6:19 PM

హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.  హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికి కాంగ్రెస్‌ గెలవకపోవడం తనను చాలా ఆశ్చర్యపర్చినట్లు చెప్పారు

Asaduddin Owaisi: హర్యానా ఫలితాలపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi
Follow us on

హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.  హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికి కాంగ్రెస్‌ గెలవకపోవడం తనను చాలా ఆశ్చర్యపర్చినట్లు చెప్పారు.  అతివిశ్వాసమే కాంగ్రెస్‌ ఓటమికి కారణమన్నారు. అయితే ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తాము గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంల గురించి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేసి, హర్యానా అసెంబ్టీ ఎన్నికల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 31 సీట్లను గెలుచుకుంది.  అయితే, జమ్మూ కాశ్మీర్‌లో 90 సీట్లు ఉంటే నేఫనల్ కాన్ఫరెన్స్ కూటిమి 48 సీట్లు గెలుకొని ప్రభుత్వం ఏర్పాటకు సిద్ధమైంది.

బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. 2014లో జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఎన్‌సి ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌లో తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్టికల్ 370 అనంతర కాలంలో జమ్మూ కాశ్మీర్‌కు ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి ఒమర్ కావడం వీశేషం.

హర్యానాలోని 90 స్థానాలకు అక్టోబర్ 5న ఒకే దశలో ఓటింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో – సెప్టెంబర్ 18, 25 మరియు అక్టోబర్ 1 తేదీలలో ఓటింగ్ జరిగింది. ఉభయ సభలకు మెజారిటీ మార్కు 46 కావడం విశేషం..

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడిన వీడియో ఇదిగో