ఖమ్మం వరదల్లో వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని ధైర్యంగా వెళ్లి కాపాడాడు జేసీబీ ఆపరేటర్ సుభాన్. అంగవైకల్యంతో ఉన్న సుభాన్ భీకర వరదను లెక్కచేయకుండా చూపించిన సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. వస్తే 9 మంది.. పోతే ఒకడ్ని అంటూ అతడు ముందుకు కదిలిన తీరుని చూసి.. అందరూ రియల్ హీరో అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అతని పేరే నెట్టింట ట్రెండింగ్.
వివరాల్లోకి వెళ్తే.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలోని మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనపై 9 మంది చిక్కుకున్నారు. తమను కాపాడాలని వారు అభ్యర్థించారు. గవర్నమెంట్ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది వారి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయింది. దీంతో సుభాన్ ఖాన్.. జేసీబీతో వెళ్లి తొమ్మిది మందిని రక్షించాడు. సుభాన్ ఖాన్ తొలిసారి వెళ్లి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో తిరిగి వచ్చాడు. రెండో సారి వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. మూడోసారి ఏదైతే అదైంది అని ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు సాగాడు సుభాన్. 9 మంది కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
అనితరమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సుభాన్ ఖాన్‌ను తాజాగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. రూ.51,000 చెక్కును అందజేశారు. అతనికి ఖమ్మంలో డబల్ బెడ్ రూమ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు.
Mewat, Haryana ke rahne waale Subhan Khan ne Telangana ke Khammam mein sailaab ki wajah se Prakashnagar bridge par phanse 9 afraad ki jaan bachaai thi. aaj Sadr-e-Majlis Barrister @asadowaisi ne Darussalam mein Subhan Khan se mulaqaat kar hausla-afzaai ki aur Majlis ki jaanib se… pic.twitter.com/4Gw76V36vs
— AIMIM (@aimim_national) September 7, 2024