Hyderabad: చిన్న హోటల్‌కు సామాన్యుడిలా అసదుద్దీన్‌ ఓవైసీ.. ఏం తిన్నారో తెలుసా?

| Edited By: Srilakshmi C

Jan 04, 2024 | 6:48 AM

హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మీరాజ్‌తో కలిసి ఆలిండియా మజ్లిస్‌ ఇ ఇత్తెహాదుల్‌ ముస్లీమిన్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ లంచ్‌ చేశారు. హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందనే విషయం తెలిసిందే. ఎవరైనా టూరిస్టులు హైదరాబాద్‌కు వచ్చారంటే బిర్యానీని టేస్ట్‌..

హైదరాబాద్‌, జనవరి 4: హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మీరాజ్‌తో కలిసి ఆలిండియా మజ్లిస్‌ ఇ ఇత్తెహాదుల్‌ ముస్లీమిన్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ లంచ్‌ చేశారు. హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందనే విషయం తెలిసిందే. ఎవరైనా టూరిస్టులు హైదరాబాద్‌కు వచ్చారంటే బిర్యానీని టేస్ట్‌ చేయకుండా వెళ్లరు. తాజాగా ఓ చిన్న హోటల్‌లో ఎంఐఎం అధినేత బిర్యానీ తినడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాతబస్తీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అసదుద్దీన్‌.. స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, మరో వ్యక్తితో కలిసి బిర్యానీ తిన్నారు. అది కూడా ఒకే ప్లేట్‌లో ముగ్గురు కలిసి భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ముస్లింలు, అరబ్‌ కల్చర్‌లో అందరూ కలిసి ఒకే పెద్ద ప్లేట్‌లో తినడం ఆనవాయితీ.

ఇప్పుడు హైదరాబాద్‌లోని కొన్ని మండీ హోటళ్లలో బిర్యానీని ఇలాగే పెద్ద ప్లేట్‌లో సర్వ్‌ చేస్తూ ఉంటారు. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కలిసి ఇలా బిర్యానీని తింటుంటారు. పార్టీ అధ్యక్షుడిగా అసదుద్దీన్‌ ఎప్పుడూ ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు. గతంలో జెడ్‌ కేటగిరి భద్రతను సైతం కాదని సామాన్యుడిలా ప్రజల్లోనే ఉంటానంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో దాడులు జరిగినా భయపడకుడా బైక్‌పై ప్రజల్లోకి వెళ్తుంటారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లే సమయంలోనూ బైక్‌పై ప్రగతిభవన్‌కు వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు. తాజాగా ఓ హోటల్‌కి వెళ్లిన ఆయన ఒక ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న మరోవ్యక్తితో కలిసి చిన్న ప్లేట్‌లో బిర్యానీ తినడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.